టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతిలో పాత్రికేయుడు జే.సుబ్రమణి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా పై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పాత్రికేయులు కరోనా బారిన పడి మృతి చెందడం బాధాకరం అని వ్యాఖ్యలు చేశారు. మీడియా సిబ్బందిని వెంటనే కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలని కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని సూచించారు.
కరోనా ఆస్పత్రుల్లో సదుపాయలను మెరుగుపరచాలని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లకు సమాచార శాఖ ద్వారా పిపిఈ కిట్లు అందజేయాలని.... కరోనా తో మృతి చెందిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని జగన్ సర్కార్ ను కోరారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్,వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాల ఫైల్ ను వెంటనే క్లియర్ చేసి పాత్రికేయులకు వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్ట్ మిత్రులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.