ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ కు చుక్కలు చూపిస్తున్నారు. పరోక్షంగా ప్రభుత్వంపై లేఖల ద్వారా విమర్శలు చేస్తున్నారు. గతంలో పార్టీలో అవినీతి జరుగుతోందని... మరో పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీస్ అందిందని వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన రఘురామ కృష్ణంరాజు తాజాగా సీఎం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాలల అభవృద్ధి కోసం కమిటీలు వేయాలని లేఖలో ఆయన కోరారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 200 గోశాల అభివృద్ధి కమిటీలు వేశారని నవ్యాంధ్రప్రదేశ్ లో గోశాల అభివృద్ధి కమిటీలు వేయలేదని, ఈ కారణంగా సింహాచలంలో ఆవులు చనిపోతున్నాయన్నాని పేర్కొన్నారు. అన్ని వర్గాలతో కలిసి గోశాల అభివృద్ధి కమిటీలు వేయాలని లేఖ ద్వారా సూచనలు చేశారు.