గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్, . రిషి కపూర్ లాంటి స్టార్లు గత కొన్ని నెలల్లో మృతి చెందారు. టీవీ నటుడు రాజన్ సెహగల్, ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ కూడా వివిధ కారణాల వల్ల కన్నుమూశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ రాజత్ ముఖర్జీ మృతి చెందారు.
జైపూర్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈరోజు తుడిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. రాజత్ ముఖర్జీ 'రోడ్' సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్యార్ తునే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్, ఇష్క్ కిల్స్, ఇతర సినిమాలకు రాజత్ దర్శకత్వం వహించారు.