రేణిగుంట విమానశ్రయంలో ఈరోజు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్ వేపై ల్యాండింగ్ పరిశీలన కోసం వెళ్లిన ఫైర్ ఇంజిన్ బోల్తా పడింది. అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడంతో బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చిన విమానాన్ని ల్యాండ్ కాకుండా ఆపగలిగారు. పైలట్ కు ముందుగానే సూచనలు చేసి విమానం తిరిగి బెంగళూరు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విమానం ల్యాండ్ అయి ఉంటే మాత్రం ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగేది.
తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన ఇతర విమానాలు సైతం ల్యాండ్ కాకుండానే వెనక్కు వెళుతున్నాయి. అధికారులు రన్ వేపై ఉన్న ఫైర్ ఇంజిన్ ను తొలగించేందుకు పనులను వేగవంతం చేశారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.