దేశంలో కొవిడ్ మహా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మన దేశంలో కరోనా కేసులు 1 మిలియన్ మార్క్‌ను అతి సులువుగా చేరుకున్నాయి. చివరి 7 లక్షల కేసులు శరవేగంగా వ్యాప్తి చెందాయి. ఇక గత 24 గంటల్లో అత్యధికంగా 38,902 కేసులు రాగా.. 543 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 10,77,618కి చేరింది.
ఆదివారంతోనే ఈ కేసులు ఏకంగా 11 లక్షలు దాటేయనున్నాయి. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 3,73,379 మంది చికిత్స పొందుతుండగా.. 6,77,423 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. ఇక మన దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 26,816 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల ముంబై బ్లాస్టులతో ఏర్పడిన మరణహోమాన్ని మించేలా కరోనా మరణహోమం దేశంలో కొనసాగుతోంది.