‌దాదాపు వారం రోజుల నుంచి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గడుపుతున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎట్టకేలకు ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. వరుస సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నా ఆయన నేడు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో  బయల్దేరారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో 5 రోజుల పాటు ఇక్కడే మకాం వేసిన పోలీస్ బాస్ వరుసగా కీలక అధికారులతో సమావేశాలు నిర్వహించారు అధికారులకు పలు సూచనలు కూడా చేశారు.

‌ఈ నెల 2న జిల్లా కు వచ్చిన  డిజీపీ మావోయిస్టుల కట్టడిపై సుదీర్ఘ సమీక్షలు చేశారు. ఏరియల్ సర్వే నక్సల్స్ ప్రభావిత తిర్యాణి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిజీపీ అప్రమత్తంగా ఉండాలని మావోయిస్టుల కదలికలు గురించి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొంత కాలంగా తిరుగుతున్న మావోయిస్టు నేత భాస్కర్ దళాన్ని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఐజి నాగిరెడ్డి మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: