సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. రమణ గత ఏడాది యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రమణపై అతని భార్య వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా రమణ గౌతమ్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.


ఈ క్రమంలో భార్యకు ఫోన్లు చేసి బెదిరించడం మొదలు పెట్టాడని  యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. తనపై పెట్టిన కేసును వాపసు తీసుకోకుంటే నగ్న చిత్రాలను యూ ట్యూబ్‌లో పెడతానంటూ ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అతని భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రమణపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: