ప్రస్తుతం మన దేశం లో కరోనా మహమ్మారి అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. దీనిలో భాగంగానే లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దేశంలో ఉన్న వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక క్రీడా రంగాల విషయం అయితే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రికెట్ గురించి చెప్పాలి. ఈ సంవత్సరం ఐపీఎల్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు అందరిలో వ్యక్తం అయ్యాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ సీజన్ ఉంటుందని చెప్పడంతో క్రికెట్ ప్రియులు తెగ ఆనందిస్తున్నారు. ఇక సెప్టెంబర్19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. కానీ ఈ సారి విజేత ఎవరూ అనే విషయాన్ని ముందు గానే కొందరు చెప్పేస్తున్నారు.


ఇందులో భాగంగా  తాజా గా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌లీ జోస్యం చెప్పారు. ఐపీఎల్ కవరేజీలో భాగంగా అతడు ముంబయి వచ్చాడు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఈసారి ఐపీఎల్‌ విజేతగా ఎవరు నిలుస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా, దీనికి సమాధానం చెప్పడం కొంత కష్టమేనన్నాడు. అయినప్పటికీ సీఎస్‌కే విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌లో కింగ్ప్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా జట్లకు గతంలో లీ ప్రాతినిధ్యం వహించాడు.ఈ సారి సీజన్ మాత్రం చాలా రసవత్తరంగా జరుగబోతుందని బ్రెట్ లీ చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: