తెలంగాణాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలపడటం ఏమో గాని కొన్ని పరిణామాలు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా బిజెపి కార్యకర్త ఒకరు ఆత్మహత్యా యత్నం చేసారు. అతనికి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

 నిన్న బీజేపీ కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నం చేసాడు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. శ్రీనివాస్  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.  ఐసీయూ కు తరలించి వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ఎవరిని లోపలి అనుమతించడం లేదు.  ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించి లోపలకి అనుమతించే పరిస్థితి  అక్కడ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: