దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నిత్యం వేలలో నమోదు అవుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులను సైతం కరోనా వదిలిపెట్టకుండా వేధిస్తోంది. తాజాగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. గత నెల రోజులుగా దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సునీతకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు చేయించుకుంది. కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. ఈమధ్య రోజుల్లో తనతో కలిసిన వారిని కరోనా టెస్ట్ చేయించుకోవాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: