ప్రముఖ గాయకుడు విజయ్‌ యేసుదాసుకి కేరళలోని కొచ్చిలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు లేకుండా విజయ్ బయటపడటం అభిమానులు ఆనందించదగ్గ విషయం. జాతీయ రహదారిపై వస్తున్న విజయ్ కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. దాంతో రెండు కార్ల ముందు భాగాలు నుజ్జు నుజ్జయ్యాయి.

తిరువనంతపురం నుంచి కొచ్చికి తన స్నేహితుడితో కలిసి అర్ధరాత్రి తన కారులోనే బయలుదేరాడు విజయ్‌. ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు కూడా. అయితే అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా కూడా రాత్రి 11.30 గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు దూసుకొచ్చింది. దాంతో ఒక్క క్షణంలోనే కంట్రోల్ కోల్పోయాడు విజయ్. అంతే ఎదుటి కారు వచ్చి విజయ్ కారును ముందు భాగంలో బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టి తప్పు ఎవరిది అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: