ఎటువంటి అల్లర్లు జరుగకుండా ఉండేందుకు గానూ ముందస్తు కట్టడి చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే ఇంటి ఎదుట పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు వందమంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే, రాజాసింగ్ మాత్రం వరద బాధితులకు సాయం అందించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తున్నారు. ప్రకటించిన పదివేల రూపాయల ఆర్ధిక సాయాన్ని తెరాస నేతలు, కార్యకర్తలకు మాత్రమే పంచుకుంటున్నారని ఆరోపించారు. చాలా కొద్దిమంది పేదలైన బాధిత లబ్ధిదారులకు మాత్రమే సాయం అందుతుందని తెలిపారు. కొందరు కావాలనే తనపై బురద జల్లడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి మాటలను నమ్మవద్దని ఆయన కోరుతున్నారు.