రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సుప్రీం prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అంతగా బాగోలేదన్నారు. రాంచీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు సోమవారంనాడు తెలిపారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌కు మంచి ఛాన్స్‌ ఉందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినప్పటికీ రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాత్రం ఇంకా టెన్షన్‌ పడుతున్నట్టుగా ఉంది.

రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో.. లాలూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని డాక్టర్లు అంటున్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం లాలూకు డయాలసిస్‌ కొనసాగుతున్నదని వివరించారు. దాణా స్కామ్‌ కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 2017 నుంచి జైలులోనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. లాలుకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయినా ఇప్పటి వరకు డయాలసిస్‌ చేయాల్సిన అవసరం రాలేదని, కాని ఇప్పుడు చేస్తున్నామని డాక్టర్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: