ఇప్పటివరకు రాష్ట్రం మొత్తం 8,29,991 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,892. వైరస్ బాధితుల్లో కొత్తగా 13 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,881కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 216 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇక, అనేక జిల్లాల్లో కరోనా నామమాత్రంగా ఉనికి చాటుకుంది. అనంతపురం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు మాత్రమే రాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 12 కేసుల చొప్పున వచ్చాయి.