ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ను ప్రపంచ వ్యాప్తంగా తొలగించడంతో కరోనా మరింత విజృంభిస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగా కొన్ని దేశాలు క్రీడలను తిరిగి మొదలు పెట్టాయి. అప్పటి నుంచి రోజుకో ఆటగాడు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు ఫుట్ బాల్ ప్లేయర్ మహమ్మద్ ఎల్నెనికు కరోనా పాజిటివ్‌ అని ఈజిప్షియన్ ఫుట్‌బాల్ అసోసియేష్(ఈఎఫ్ఏ) ప్రకటించింది.

మహమ్మద్ ఆర్సెనల్ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్నాడు. అయితే కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడి తగిన చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అతడికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, అంతా బాగానే ఉన్నాడని తెలిపారు. అతడికి ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. ఈజిప్ట్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ చివరి వారంలో కరోనా బారిన పడ్డాడు. అతడు అతితక్కువ లక్షణాలతో ఇబ్బంది పడ్డాడని ఈజిప్ట్‌కు చెందిన డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మహమ్మద్ తేకపోవడం జట్టుకు కాస్త ఇబ్బందికర విషయంగానే భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: