ప్ర‌స్తుతం ఏపీని విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ అంశం కుదిపేస్తోంది. రాజ‌కీయంగా కూడా విశాఖ ఉక్కు అంశం ఓ రేంజ్‌లో హీటెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే విశాఖ ఉక్కు - ఆంధ్రుల హ‌క్కు అన్న నినాదాన్ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తెస్తూ అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. తాజాగా  ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్షం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఇక్క‌డ ప‌ని చేస్తోన్న కార్మికుల‌తో పాటు రాజ‌కీయ ప‌క్షాలు ఎన్ని ఆందోళ‌న‌లు చేస్తున్నా కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: