చంద్ర‌బాబు చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న అంతా పెద్ద హైడ్రామాలో ఉంది. చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలికి వెళ్లాల‌నుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకుని వెన‌క్కి వెళ్లాల‌ని కోరుతున్నారు. చంద్ర‌బాబు నిర‌స‌న కార్య‌క్ర‌మానికి ఎన్నిక‌ల కోడ్ ఉండ‌డంతో ఒప్పుకోలేదు. చివ‌ర‌కు పోలీసులు చంద్ర‌బాబు పీఏతో పాటు వైద్యాధికారి ఫోన్లు లాగేసుకున్నారు. బాబు అధికారుల‌ను క‌లుస్తాన‌ని చెప్పినా అందుకు కూడా అనుమతి ఇవ్వ‌డం లేదు. త‌న‌కు అనుమ‌తి ఇచ్చేవ‌ర‌కు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి క‌ద‌ల‌బోనంటూ పోలీసుల‌కు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ ప్ర‌తిప‌క్ష నేత‌గా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌ను క‌లిసే హ‌క్కు కూడా త‌న‌కు లేదా? అంటూ మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: