దేశ‌వ్యాప్తంగా రైతు ఉద్య‌మం ఉధృతంగానే కొన‌సాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత కొన్ని నెలలుగా ఉద్యమం కొన‌సాగుతోంది. తాజాగా వీరు ఈ నెల 26న దేశ‌వ్యాప్తంగా బంద్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి తాము ఆందోళన చేపట్టి నాలుగు నెలలు పూర్త‌వుతోన్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ నిర్వహిస్తామని, ఎలాంటి అల్లర్లు, ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా బంద్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇక దేశ‌వ్యాప్తంగా ఇష్టానుసారం పెరిగిపోతోన్న పెట్రోల్ ధ‌ర‌లు, ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తున్నందుకు నిర‌స‌న‌గా ఈ నెల 15న దేశ‌వ్యాప్తంగా ట్రేడ్ యూనియ‌న్లు ఆందోళ‌న చేస్తున్నారు. వీటికి కూడా తాము మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని రైతులు తెలిపారు. అలాగే ఈ నెల 29న హోలీ సంద‌ర్భంగా హోలీ కా దహన్ పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేయనున్నట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: