తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా మంగళవారం ఉద‌యం పోలింగ్ ప్ర‌శాంతంగా ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు సినీన‌టులు ఓట్లేసి ఎన్నిక‌ల్లో హైలెట్‌గా నిలిచారు. మక్కల్ నీధి మయ్యాం అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ తన కుమార్తెలతో కలిసి చెన్నైలోని తైనంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు.
 
కమల్ హాసన్ ముఖానికి మాస్కు ధరించి తన కుమార్తెలతో కలిసి వచ్చి క్యూలో వేచి ఉండి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్టెల్లామేరీస్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సినీనటుడు రజనీకాంత్ ఓటేశారు. మంగళవారం ఉదయాన్నే ఇద్దరు సినీనటులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: