విజయవాడ పశ్చిమనియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, సీపీఐ సీనియర్‌ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) మృతి చెందారు. విజయవాడలోని తన నివాసంలో గుండెపోటుతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కృష్ణా జిల్లాలో సీపీఐ సీనియ‌ర్ నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. వివాదాల‌కు దూరంగా ఉండేవారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు. ఉమ్మడి ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: