కరోనా విలయ తాండవం చేస్తుండడంతో పలు రాష్ట్రాలు నిషేధాజ్ఞలు విధించాయి. దేశ రాజ‌ధాని న‌గ‌రం అయిన ఢిల్లీలో నాలుగో వేవ్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ విధించారు. ఇప్ప‌టికే అక్క‌డ రాత్రి క‌ర్ప్యూ అమ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే కేవ‌లం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న అమ‌లు చేస్తుండ‌గా.. ఇప్పుడు ఏకంగా షాక్ ఇస్తూ 30 శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్లు న‌డ‌పాల‌ని చెపుతున్నారు.

ఈ నెల 30 వరకు రెస్టారెంట్లలో, సినిమా థియేటర్లలో డైనింగ్‌ను అనుమతించబోం. రెస్టారెంట్లు పార్శిల్‌ సేవలను అందజేయవచ్చు అని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. పెళ్లిళ్లపైనా ఎలాంటి నిషేధాజ్ఞలు ఉండవని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: