ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పదుల్లో ఉంటూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌త 24 గంట్లో ఏపీలో 5,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 27 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000 కు చేరుకుంది.

క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 7,437 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 48,053యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు  9,12,510 డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌జ‌లు క‌రోనాను లైట్ తీస్కోవ‌డం.. క‌నీస జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డంతో పాటు ప్ర‌భుత్వం ముందు ఉదాసీనంగా ఉండి.. ఇప్పుడు నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయ‌డం లాంటి కార‌ణాల‌తో ఇక్క‌డ కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: