తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘ శుధ్ద పౌర్ణమి రోజున నిర్వహించ‌డం కామ‌న్‌. ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి ఈ జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇక వ‌చ్చే యేడాది జాత‌ర విష‌యానికి వ‌స్తే 2022 ఫిబ్రవరి 16న గద్దెలపైకి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు రానున్నారు. ఫిబ్రవరి 17న సమ్మక్క అమ్మవారు గద్దెలపైకి రానున్నారు. ఫిబ్రవరి 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 19న అమ్మవార్ల వనప్రవేశం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: