అసోంలో బీజేపీ గెలవడానికి ఒక్క ముస్లిం ఓటు కూడా పడలేదనే నిర్ధారణకు వచ్చిన పార్టీ.. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సెల్ యూనిట్ ను తొలగించేందుకు ప్లాన్ చేసింది. 126 అసెంబ్లీ స్థానాల్లో పొత్తు పెట్టుకుని 75సీట్లు గెలవగా అందులో బీజేపీకి 60 సీట్లు వచ్చాయి. ఈ ఫలితాల తర్వాత రాష్ట్ర బీజేపీ చీఫ్ రంజిత్ దాస్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల వరకూ మైనారిటీ సెల్ ను రద్దు చేస్తున్నాం అని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. 31-34 ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో
బీజేపీ 2016లో ఒకే ఒక్క సీట్ దక్కించుకుంది. ఇక ఈ ఎన్నికల్లో
బీజేపీ దాని
మిత్ర పక్ష పార్టీలు పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు ఓట్లు రాబట్టలేకపోయారు. ఈ ఏడాది అస్సాం అసెంబ్లీలో 24శాతం ముస్లిం ప్రతినిధులు ఉండబోతున్నారు. ఈ 31 మందిలో 16మంది
కాంగ్రెస్ + దాని
మిత్ర పక్షం మహాజోత్ ఏఐయూడీఎఫ్ 15మంది ఉన్నారు.