క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు సీఎం కేసీఆర్ మొద‌టగా సూప‌ర్ స్ప్రైడర్ ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా వ్యాప్తికి ఎక్కువ‌గా కార‌ణం అయ్యే, ఎక్క‌వ క‌రోనా బారిన ప‌డే అవ‌కాశ‌మున్న‌ ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, జ‌ర్న‌లిస్ట్ లు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌ను సూప‌ర్ స్పైడ‌ర్ లు గా గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 30ల‌క్ష‌ల మంది సూప‌ర్ స్ప్రైడ‌ర్ లు ఉన్నార‌ని అధికారులు నిర్ధారించారు. వీరిలో మొద‌టి ద‌శ‌లోనే వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ లు వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మే 28 నుండి రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య‌కేంద్రాల్లో వ్యాక్సిన్ లు వేయ‌డం కూడా ప్రారంభించారు.

అయితే హైద‌రాబాద్ లో మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు సూప‌ర్ స్ప్రైడ‌ర్ లు ఎవ‌రూ ముందుకు రావ‌డంలేద‌ని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజులు మాత్ర‌మే ఈ స్పెష‌ల్ డ్రైవ్ ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలో కేవ‌లం 20వేల మంది సూప‌ర్ స్ప్రైడ‌ర్ లు మాత్ర‌మే వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ హైద‌రాబాద్ లో ఉన్న మొత్తం సూప‌ర్ స్ప్రైడ‌ర్ ల సంఖ్య చూస్తే 4ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంది. క‌నీసం స‌గం మంది కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తుంటే ఫ‌లితం లేకుండానే పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: