క‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మ‌ర‌ణించారు. ప‌లువురు చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా క‌రోనా కార‌ణంగా ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు క‌రోనాతో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 101 ఏళ్లని తెలుస్తుంది. సంగీతరావు సంగీత దిగ్గ‌జం ఘంట‌సాల వద్ద శిష్య‌రికం చేసారు. 1920 లో విజ‌యనగ‌రంలో జ‌న్మిచిన సంగీత రావు చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పట్రాయని వారి కుటుంబంలో సంగీతరావు మూడో త‌రానికి చెందిన వారు. ఘంట‌సాల వ‌ద్ద సంగీత రావు దాదాపు పాతికేళ్ల పాటు ప‌నిచేశారు. హార్మోనియం వాయించ‌డంలో సంగీత‌రావు దిట్ట‌...అంతే కాకుండా సంగీతరావు సాహితీ రంగంలోనూ రానించారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లాంటి ప‌త్రిక‌ల్లో ఆయ‌న ఎన్నో ర‌చ‌న‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: