ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని జగన్ సర్కార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ సెకండ్‌వేవ్‌లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ, ఇంటర్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా దానిపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిగింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పటికే వాయిదా వేసామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జులై లో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామని పేర్కొంది. పరీక్షలకు15 రోజుల ముందే సమాచారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 30కి వాయిదా వేసింది. దాంతో పరీక్షలు రద్దు చేయడం లేదని క్లారిటీ వచ్చింది.
మరింత సమాచారం తెలుసుకోండి: