క‌రోనా క‌ట్ట‌డిలో డాక్ట‌ర్లు, హెల్త్ వ‌ర్కర్ల కృషి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్క‌వే. డాక్ట‌ర్లు ప్రాణాల‌ను రిస్క్ లో పెట్టి క‌రోనా బాధితుల‌కు వైద్యం చేస్తుంటే హెల్త్ వ‌ర్క‌ర్లు వ్యాక్సిన్ లు ఇవ్వ‌డం కరోనా బాధితుల‌కు టెస్టులు నిర్వహించడం చేస్తున్నారు. అయితే తాజాగా కాశ్మీర్ లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు హెల్త్ వ‌ర్క‌ర్లు ఎంతో రిస్క్ చేశారు. టీకా డ్రైవ్ నిర్వహించడానికి హెల్త్ వ‌ర్క‌ర్లు రాజౌరిలోని కంది బ్లాక్ మారుమూల ప్రాంతానికి చేరుకోవడానికి ఒక నదిని దాటారు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు హెల్త్ వ‌ర్కర్లు ఉన్నారు. వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఓ పురుషుడు ఉన్నారు. అయితే న‌ది పారుతున్న‌ప్ప‌టికీ ప్రాణాల‌కు తెగించి వారు న‌ది దాటంతో వారి డెడికేష‌న్ కు నెటిజ‌న్లు సెల్యూట్ చేస్తున్నారు. మూరుమూల గ్రామాల్లో కూడా వంద శాతం వ్యాక్సినేష‌న్ ను పూర్తి చేస్తామ‌ని ఆ ప్రాంత మెడిక‌ల్ ఆఫీస‌ర్ ఇక్బాల్ చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: