తెలంగాణలో నేటి నుండి ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్తు ప్యాకేజీ కింద ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే బియ్యంతో పాటు
తెలంగాణ కోటా కింద ఈ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. అయితే వైట్ రేషన్ కార్డు ఆహాభద్రత కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అంతే కాకుండా ఒక్కో వ్యక్తికి 15 కిలోల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎంత మంది ఉంటే అంతమందికి బియ్యాన్ని అందిస్తారు. అయితే సాధారణ సమయాల్లో అయితే కేవలం ఒక్కో వ్యక్తి ఆరు కిలోల బియ్యం మాత్రమే సరఫరా చేస్తారు. కానీ ప్రస్తతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.