నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేజినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ రేపు జూన్ 9తో ముగియ‌నుంది. దాంతో లాక్ డౌన్ ను స‌డ‌లిస్తారా...లేదంటే పొడిగిస్తారా అనే అంశంపై ఈరోజు స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన కార‌ణంగా లాక్ డౌన్ ను స‌డలించాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పీఆర్సీ పై కూడా ముఖ్య‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఔట్ సోర్సింగ్ మ‌రియు కాంటాక్ట్ ఉద్యోగుల‌కు జీతాలకు సంబంధించిన అంశం పై కూడా ముఖ్య‌మంత్రి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: