తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల్లో, పట్టణాల్లో పచ్చదనం పరిశభ్రతను పెంచేందుకు తీసుకు వచ్చిన పథకం పల్లె ప్రగతి. అయితే తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలు తీరుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట. అదనపు కలెక్టర్ ల పనితీరు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో లేకపోవడం పై కేసీఆర్ కోపంగా ఉన్నారట.

ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి పథకం అమలు పై కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: