టీటీడీ పాలకమండలి సమావేశంలో దేశవ్యాప్తంగా  శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఓ ఆలయం నిర్మిస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఆలయాన్ని జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 62 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ఆలయాన్ని రూ. 33.22 కోట్లతో రెండు విడతల్లో నిర్మించబోతోంది. అంతే కాకుండా కేవలం 18 నెలల్లోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ఆలయ నిర్మాణ స్థలాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇదిలా ఉండగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ టీటీడీ ఓ ఆలయం నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd