టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నార‌ని యాంక‌ర్ ర‌ఘును పోలీసులు ఇటీవ‌ల అరెస్ట్ చేసార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే గుర్రంబోడు తండా ఘర్షణను ప్రోత్సహించేలా వ్యవహరించమే కాకుండా పోలీసులపై దాడులకు కారణమయ్యాడని...ర‌ఘుపై కేసులు న‌మోదు చేశిన‌ట్టు తెలిపారు. మొత్తం ర‌ఘుపై మూడు కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే తాజాగా మిర్యాల‌గూడ కోర్టు ర‌ఘుకు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే 30 వేల రూపాయ‌ల పూచీక‌త్తు పై ఈ బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.దాంతో రేపు న‌ల్గొండ జైలు నుండి ర‌ఘు విడుద‌ల కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: