సిద్దిపేట పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ పయనమైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుద్దెడ గ్రామం వద్ద అడవి పందులు ఎదురుగా రావడంతో కాన్వాయ్ లోని వాహనాన్ని హరీష్ రావు వాహనం ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో హరీష్ రావు డ్రైవర్, గన్ మెన్ కు గాయాలయ్యాయి . హరీష్ రావుకు ప్రమాదంలో ఎలాంటి గాయాలవ్వలేదు . 

అయితే దీనిపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. సిద్దిపేట నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో కొండపాక వద్ద తన కారుకు ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని డ్రైవర్ గన్ మెన్ లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు . వారు కూడా క్షేమంగానే ఉన్నారని తెలిపారు దయచేసి మిత్రులు శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని హరీష్ కోరారు .


మరింత సమాచారం తెలుసుకోండి: