ఇప్పుడిప్పుడే క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి త‌గ్గుముఖం ప‌డుతోంది. కేసులు మ‌ర‌ణాలు గ‌త కొద్ది రోజులుగా త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. కరోనా కేసుల్లో దేశంలో మహారాష్ట్ర ముందు నుండి మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఆదివారం నాడు ఒక మరణం కూడా సంబంధించలేదు. జిల్లాలో 345 రోజుల తర్వాత ఒక్క మరణం లేకపోవడం విశేషం. 

మూడు నెలల క్రితం జిల్లాలో రోజుకు 100 మరణాలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్క మరణం కూడా సంభవించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రస్తుత వాతావరణం కూడా వైరల్ ఇన్ఫెక్షన్ల కు అనుకూలంగా లేదని చెబుతున్నారు. అంతేకాకుండా నాగపూర్ చుట్టూ పక్కల గ్రామాల్లో కూడా కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ప్ర‌జ‌లు జాగ్ర‌త్తలు పాటిస్తూ ఉండాల‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: