తెలంగాణ ప్రభుత్వం నేడు అఖిల పక్ష సమావేశం నిర్వహించడానికి సిద్ధమవుతోంది. సీఎం దళిత సాధికారత పథకానికి సంబంధించి విధివిధానాల రూపకల్పన పై నేడు ముఖ్యమంత్రి అన్ని రాజకీయ పార్టీలతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఉదయం 11:30 కు ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అంతేకాకుండా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు.

ముఖ్యమంత్రిి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పలువురు నాయకుల సైతం ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశం కానుంది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ కు ఇన్ని రోజులకు మళ్లీ దళితులు దళితులు గుర్తొచ్చారా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: