మా ఎన్నిక‌ల హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్ప‌టికే న‌లుగురు న‌టీన‌టులు బ‌రిలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించగా తాజాగా మ‌రో న‌టుడు ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఎన్నో పాత్ర‌లు చేసిన న‌టుడు సీవీ ఎల్ న‌ర్సింహారావు తాను మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. తాను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నా అని...తెలంగాణ వాదం త‌న ప్యాన‌ల్ అని ప్ర‌కటించారు. తెలంగాణ క‌ళాకారులు వారి ఇబ్బందుల‌ని చెప్పారు. అంతే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా చిన్న న‌టీన‌టుల‌కు కూడా స‌హాయం చేయ‌డం అని అన్నారు.

ప‌ర‌భాషా న‌టీన‌టుల వ‌ల్ల తెలుగు న‌టీన‌టుల‌కు ఎంతో నష్టం జ‌రిగిందన్నారు. ఏపీ తెలంగాణ కు ప్ర‌త్యేక‌మైన ఎన్నిక‌లు ఉండాల‌ని ఇద్ద‌రు అధ్య‌క్షులు ఉండాల‌ని అన్నారు. త‌న ప్యాన‌ల్ లో 18 మంది ఉన్నార‌ని వారిలో తొమ్మిది మంది తెలంగాణ వాళ్లు ఉంటార‌ని అన్నారు. తెలంగాణ క‌ళాకారుల‌కు న్యాయం చేయ‌డం కోసం తాను ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ను,జీవిత‌, హేమ పోటీ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: