అగ్ని సిరీస్ లో అగ్ని పీ ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిస్సా తీరంలో ఈ ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి ఈ ప్రయోగాలను జరిపారు. 1000 కిలో మీటర్ల నుండి 2000 వేల కిలోమీటర్ల వరకూ దూసుకుపోయే సామర్థ్యం ఈ వేరియంట్ కు ఉంది. తూర్పుతీరం వెంబడి ఉన్న పలు టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాలను పరీక్షించాయి. ఇక ఈ క్షిపణి క్రమపద్ధతితో అన్ని లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకుంటుందని ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా అగ్ని సిరీస్ లలో పీ సిరీస్ మొదటిది. ఇది అగ్ని 3 కంటే 50శాతం అధిక బరువును కలిగి ఉంటుంది. దీన్ని రైలు మార్గం మరియు రహదారి మార్గం ద్వారా కూడా తీసుకువెళ్లవచ్చని....అంతే కాకుండా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చని డీఆర్డీఓ ప్రకటించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అగ్ని పీ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలో మీటర్ల మధ్య దూరంగా ఉన్నా లక్ష్యాన్ని చేదించగలదు.
మరింత సమాచారం తెలుసుకోండి: