ఆంధ్రప్రదేశ్ లో రహదారులు నెత్తురోడుతున్నాయి. ఇప్పటికే నిన్న అనకాపల్లి లో జరిగిన ఫ్లై ఓవర్ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ఉదయం విశాఖపట్నం జిల్లా గాజువాక ఆటో నగర్ దగ్గర ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఎదురుగా వెళ్తున్న వాన్ ని ఢీకొని బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.


 వారందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.. ఏ మాత్రం అనుభవం లేని క్లీనర్ లారీ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: