కరోనా విజృంభణ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇంటర్ ఫలితాలు ఎలా ఉండబోతాయోనని ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఇంటర్ ఫలితాల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన విద్యాశాఖ అధికారులు ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు టెన్త్ టాప్ 3 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కు ల్లో నుండి 30 శాతం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల నుండి 70 శాతం ఆధారంగా చేసుకొని ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ నెలాఖరులోపు ఇంటర్ విద్యార్థులకు మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల ఆధారంగానే ఇంటర్ సెకండియర్ ఫలితాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: