దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మొన్నటి వరకు 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా ఇప్పుడు 40 వేల పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 45,892 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 30,70,9557 కు చేరుకుంది. ఇక దేశంలో నిన్న 817 మంది ప్రాణాలు కోల్పోగా... మొత్తం మృతుల సంఖ్య 4,05,028 కి చేరుకుంది. ఇక దేశంలో నిన్న మొత్తం 44 వేల 291 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1.50 శాతం ఉండగా... రికవరీ రేటు 97.18 శాతానికి పెరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉంది. అయితే కేసుల సంఖ్య పెరిగినప్పటికీ రికవరీ రేటు అనేది భారీగా పెరగడం ఊరట కలిగిస్తోంది. ఇక దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో  వ్యాక్సిన్లు కూడా శరవేగంగా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు వ్యాక్సిన్లు ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: