కరీంనగర్ లో కళాభారతి నిర్మాణం కోసం స్థలం పరిశీలించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో కలిసి వెళ్లారు. అయితే కళాభారతి నిర్మాణం కోసం ఎస్ఆర్ఆర్ కాలేజీలో స్థలాన్ని పరిశీలించారు. కాగా అక్కడికి వచ్చిన ఒక కాలేజీ స్టూడెంట్ మంత్రి మరియు పోలీసులతో వాదనలు చేశారు. ఇది కాలేజీ స్థలమని ఇక్కడ ఏమి కట్టవద్దని మంత్రితో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడే ఉన్నా కలెక్టర్ మేయర్ జోక్యం చేసుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వ స్థలం తెలియకపోతే తెలుసుకోండి అంటూ స్టూడెంట్ తో వాదించారు. అనంతరం ఇద్దరి మధ్య మాటలు పెరుగుతుండటంతో పోలీసులు స్టూడెంట్ ను అక్కడ నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అతనికి నాలుగు తగిలించండి అంటూ పోలీసులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవడంతో విద్యార్థి సంఘాలు మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: