బిజెపి నేత విజయశాంతి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 లో కాంగ్రెస్ నుండి గెలిచిన కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని అంటున్నారని చెప్పారు. కేవలం కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు..తెలంగాణలో ఎన్నికల్లో  కొట్లడాలంటే బీజేపీకే సాధ్యం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తో  ఎన్నికలు సాద్యపడవనే అభిప్రాయంలో చాలా మంది నేతలు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించినా వాళ్ళు టీఆర్ఎస్ లోనే చేరతారని రాములమ్మ అన్నారు.

గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన విషయం కళ్ళముందే ఉందంటూ వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న పీసీసీ రేవంత్ రెడ్డి ప్రకటన కూడా మాటలకే పరిమితమయ్యేలా కనిపిస్తుందంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణను లూటీ చేసి అప్పుల్లోకి నెట్టేస్తున్న టిఆర్ఎస్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలి అంటే అది బిజెపికే సాధ్యమని విజయశాంతి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: