ఆంధ్రప్రదేశ్ లోని అన్ని డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుండి 100% ఇంగ్లీష్ మీడియం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ద్విభాషా పుస్తకాలను అందించబోతున్నరు. దాంతో ఇక పై విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఒకే పాఠం ముద్రిస్తారు.

ఇలా చేయడం వల్ల ఇంగ్లీషు అర్థం కాని వారు తెలుగులో చదువుకుని ఆ పాఠం ను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఒకే పుస్తకంలో రెండు భాషల్లో ముద్రించడం వల్ల విద్యార్థులకు చదువుకోవడానికి చాలా సులభతరం అవుతోంది. అంతేకాకుండా తెలుగు మీడియం విద్యార్థులకు సైతం ఇంగ్లీష్ లాభంగా నేర్చుకునేందుకు ఈ పుస్తకాలు ఎంతో సహాయపడతాయి. ఇక త్వరలోనే ఈ పాఠ్యపుస్తకాలను ఏపీ సర్కార్ ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: