ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు తన సొంత లోకసభ నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 1500 కోట్ల రూపాయలతో ప్రధాని వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. కాశీలో నివసించే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఈరోజు వారణాసికి చేరుకున్న అనంతరం ఉదయం 11 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో టూరిజం డెవలప్మెంట్, వారణాసి ఘాజీపూర్ మధ్య హైవే నిర్మాణం తో పాటు మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు ప్రధాని ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. దీనిని జపనీస్ అసిస్టెంట్ సహాయంతో నిర్మించారు. అంతే కాకుండా ఈ రోజు ఆయన కరోనా పై కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: