బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సురేఖ సిక్రీ 75 గుండెపోటుతో మరణించారు. ముంబైలోని తమ నివాసంలో సురేఖ సిక్రీ కన్నుమూసారు. ఇక ఆమె మృతి పై ప‌లువురు సీని ప్రముకులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్నో సినిమాలు, సీరియల్ లతో బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా టీవీ షోల‌లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. తమాస్, జుబేదా, బాలికా వధు ఇలాంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 

అంతేకాకుండా 2018 లో విడుదలైన బ‌దాయి హో అనే చిత్రంలో హీరో ఆయుష్మాన్ కురానా నానమ్మ గా నటించి సురేఖ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇప్పటి వర‌కూ ఆమె మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా బాలికా వధు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో డ‌బ్ కావ‌డంతో తెలుగువారికి సైతం ద‌గ్గ‌ర‌య్యారు. సురేఖ త‌న న‌ట‌న‌తో తెలుగు వారిని సైతం ఫిదా అయ్యేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: