వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా స‌మావేశంలో ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణకు రాజశేఖర్ రెడ్డి మంచి చేశారా చెడు చేశారా అనేది గ్రామాలకు వెళ్లి అడిగితే తెలుస్తుంది అన్నారు.

 వైయస్ తెలంగాణకు ముమ్మాటికీ వ్యతిరేకి కాదు అంటూ ఆమె స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని ఆమె చెప్పుకొచ్చారు. నాది తెలంగాణ గడ్డ ఇది రియాలిటీ అంటూ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వొద్దని తామెప్పుడూ అనలేదని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తాను పోరాటం చేస్తానని షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మీడియా సమావేశానికి హాజరైన విలేకరులు అడిగిన ప్రశ్నలకు షర్మిల సమాధానం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: