ఏపీలో స్కూళ్ళ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆగస్టు 16 నుండి పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అదే రోజు నూతన విద్యా విధానం గురించి వివరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అదేనరోజు విద్యార్థులకు విద్యా కానుక కిట్లను కూడా అందజేస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారు అన్న ఆసక్తి నెలకొంది. దానికి కారణం కరోనా సెకండ్ వేవ్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక దూరం కరోనా నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ఆగస్ట్ లోనే ఉంటుందని డబ్ల్యూహెచ్వో మరియు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపించడానికి ఆసక్తి చూపుతారా లేదా అన్న ప్రశ్న ఎదురవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: