తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు రాష్ట్రంలోనే భారీ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. సోలార్ సెల్ మరియు మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టును ఈరోజు కేటీఆర్ ప్రారంభించారు. ఈ కంపెనీని ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ‌ 483 కోట్లతో ప్రారంభిస్తోంది. ప్రస్తుతం 700 మందికి ఉపాధిని కల్పించనుంది. అంతేకాకుండా దీనిని పన్నెండు వందల కోట్ల బడ్జెట్ కు పెంచి త్వరలో రెండు వేల మంది కి ఉపాధి కనిపించబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. 

ఇది ఇలా ఉండగా తెలంగాణలో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన అనంతరం ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈట‌ల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ లో ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ ఇప్పటికే వరాల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా తన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: