ఆషాడ మాసం బోనాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈరోజుతో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. ఆషాడ మాసం ఆదివారం గోల్కొండ కోటలో ఆ తర్వాత సికింద్రాబాద్ లస్కర్ ఉజ్జయినీ బోనాల జాతరలు ముగిసాయి. ఇక ఈరోజు పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు బోనాల పండక్కి భారీగా తరలి వస్తున్నారు. ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి అభిషేకం పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఎనిమిది గంటలకు మొదటి బోనం సమర్పించారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు. ఇక ఆదివారం ఆఫీసులకు వ్యాపార సంస్థలకు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా ఉత్సవాలకు తరలి వస్తున్నారు. రెండు వేల కంటే ఎక్కువ ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం మీరాలం మండి మహంకాళి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం పలు ఆలయాల్లో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఘటాల ఊరేగింపుతో ఈ వేడుక పూర్తి కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: